దర్శిలో ఫ్లెక్సీలు కట్టాలంటే మున్సిపల్ అధికారుల పర్మిషన్లు తప్పనిసరి చేస్తూ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. దర్శి గడియార స్తంభం సెంటర్లో ఏర్పాటు చేస్తున్న ఫ్లెక్సీలతో వాహనదారులతో పాటు, డివైడర్లపై కట్టే ఫ్లెక్సీలతో కొన్ని సమస్యలు వస్తున్నాయంటూ కొందరు దర్శి ప్రజలు మున్సిపల్ అధికారులకు తెలిపినట్లు తెలిసింది. ఇకనుండి ఫ్లెక్సీలు ఏర్పాటు చేయాలంటే నగర పంచాయతీ పర్మిషన్ తీసుకోవాలని లేదంటే వారిపై చట్టపరమైన చర్యలు కూడా తీసుకోబోతున్నట్లు సమాచారం. ఇదే విషయాన్ని అన్ని రాజకీయ పార్టీల నాయకులకు, ఫ్లెక్సీల షాపుల యజమానులకు కూడా తెలియజేసినట్లు సమాచారం.
