విద్యారంగ పరిరక్షణకు, ఉపాధ్యాయుల సమస్యలపై నిత్యం పోరాడుతున్నది. ఎపీటీఎఫ్ – తాళ్లూరు మండల నూతన ఎపీటీఎఫ్ కార్యవర్గం ఎంపిక

విద్యారంగ పరిరక్షణకు, ఉపాధ్యాయుల సమస్యలపై ఆంద్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ (ఎపీటీఎఫ్) నిరంతరం పోరాడుతుందని ఎపీటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు వాకా జనార్థన్ రెడ్డి అన్నారు. సంఘ బలోపేతానికి ఉపాధ్యాయులు తమ వంతు కృషి చెయ్యాలని కోరారు. పలు సమస్యలపై చర్చించారు. అనంతరం నూతన కమిటీని ఎన్నుకున్నారు. తాళ్లూరు మండల ఎపీటీఫ్ శాఖ గౌరవ అధ్యక్షులుగా పోలం రెడ్డి సుబ్బా రెడ్డి, అధ్యక్షులుగా జి. నాగరాజు, ప్రధాన కార్యదర్శి ఎన్. శ్రీనివాసరావు, ఉపాధ్యక్షులుగా కె జవహార్ బాబు, ఎస్ హనుమంతరావు, నాగలక్ష్మి, కార్యదర్శులుగా డి. రమేష్ బాబు, పి. శ్రీదేవి, జి. వేణు, పి. శ్రీమన్నారాయణ, జిల్లా కౌల్సిలర్లు గా షేక్ ఖాజావలి, ఎస్ శిరీష, శేషగిరి, ఎస్. రవిచంద్రా రెడ్డిలను ఎన్నుకున్నారు. ఆడిట్ కమిటీ సభ్యులుగా కె. శేషు, ఎంవీ నాగేశ్వరరావు, బి. అంజి రెడ్డిలను ఎకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఎన్నికల అధికారులుగా జిల్లా అధ్యక్షుడు వాకా జనార్థన్ రెడ్డి, ఉపాద్యక్షుడు లెవీ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *