వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మండల పార్టీ అధ్యక్షులుగా నూతన అధ్యక్షుల నియమిస్తూ తాడేపల్లి నుండి కేంద్ర పార్టీ కార్యాలయం ఉత్వర్వులు విడుదల చేసారు. దర్శి నియోజక వర్గంలో దర్శి మండల పార్టీ అధ్యక్షుడిగా వెన్నపూస వెంకట రెడ్డి, దర్శి, టౌన్ అధ్యక్షుడిగా కట్టెకోట హరీష్, దొనకొండ మండల అధ్యక్షుడిగా కందుల నారప రెడ్డి, కురిచేడు మండల అధ్యక్షుడిగా యన్నా బత్తుల వెంకట సుబ్బయ్య, ముండ్లమూరు మండల అధ్యక్షుడిగా బిజ్జం సుబ్బా రెడ్డి, తాళ్లూరు మండల అధ్యక్షుడిగా తూము వెంకట సుబ్బా రెడ్డిలను నియమించారు. నూతనంతా ఎంపికయిన అధ్యక్షులకు దర్శి ఎమ్మెల్యే డాక్టర్ మద్దిశెట్టి వేణుగోపాల్ శుభాకాంక్షలు తెలిపారు. పార్టీకి అంకిత భావంతో పనిచేసి 2024లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గెలుపునకు అంకిత భావంతో కృషి చెయ్యాలని కోరారు. తమకు అవకాశం కల్పించి మండల పార్టీ అధ్యక్షులుగా నియమించినందుకు ఆయా మండలాల పార్టీ అధ్యక్షులు కృతజ్ఞతలు తెలిపారు. తమ వంతు పార్టీ అభ్యున్నతికి అందరిని కలుపుకుని కృషి చేస్తామని తెలిపారు.
