వినాయక చవితి వేడుకల సందర్భంగా పాటించాల్సిన నియమ నిబంధనలు, తీసుకోవలసిన ముందస్తు జాగ్ర త్తలు దర్శి డీఎస్పీ అశోక్ వర్ధన్ వినాయక ఉత్సవ కమిటీ సభ్యులకు వివరించారు. దర్శి పోలీస్ స్టేషన్ ఆవరణలో ఏర్పాటుచేసిన సమావేశంలో డీఎస్పీ అశోక్ వర్దన్ మాట్లాడుతూ… వినాయ కచవితి సందర్భంగా గణేష్ విగ్రహప్రతిష్ఠ, పందిళ్ళు, మండపాలు ఏర్పాటు చేసుకోవడానికి ఐదు లేదా అంతకంటే ఎక్కువ మంది సభ్యులతో కమిటీగా ఏర్పడి వారి వివరాలు పోలీస్ స్టేషన్లో తెలియజేయాలన్నారు. ఊరేగింపు స మయంలో ట్రాఫిక్ ఇబ్బంది కలుగకుండా రద్దీని నివారించేందుకు మరియు భద్రత కొరకు తగినంత మంది కమిటీ సభ్యులు, ఉత్సవ నిర్వాహకులు ఏ ర్పాటు చేసుకోవాలన్నారు. ఇలా కాకుండా నిబ్బందనలను ఉల్లంఘించిన యెడల చట్ట పరమైన కఠిన చర్యలకు అర్హులు అవుతారని హెచ్చరిం చారు. ఎస్సై రామకృష్ణ సిబ్బంది పాల్గొన్నారు.
