దేశాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తూ భారతదేశాన్ని అగ్రగామి నిల్పిన మహోన్నత వ్యక్తి ప్రధాని నరేంద్ర మోదీ జీ అని దర్శి నియోజకవర్గం బి. జె. పి కన్వీనర్ మాడపాకుల శ్రీనివాస్ అన్నారు. దర్శి లో మోదీ జీ జన్మదిన ని ఘనంగా ఆదివారం నిర్వ హించారు. స్థానిక షిర్డీ సాయి సేవా వృద్ధ ఆశ్రమం నందు గల బాబా గుడి లో పూజలు నిర్వహించారు. ఆశ్రమం లోని వృద్ధులకు పండ్లు, రొట్టెలు పంపిణీ చేశారు. మోదీ జీ జన్మ దినం సందర్భంగా వచ్చే నెల రెండొవ తేది వరకు సేవా కార్యక్రమంలు నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమం లో జిల్లా ఉపాధ్యక్షులు తిండి నారాయణ రెడ్డి, ఎస్. సి మో రా ప్రధాన కార్యదర్శి ఆంజనేయులు, మండల అధ్యక్షులు నాగ సాయి, వంకదారి కుమార్, అనిల్, నరసింహారావు, రాజ ప్రతాప్, శరత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.



