పండుగను ప్రశాంతంగా జరుపుకోవాలి -వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన దర్శి ఎమ్మెల్యే డాక్టర్ మద్దిశెట్టి వేణుగోపాల్

వినాయకచవితి సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ మద్దిశెట్టి వేణుగోపాల్ నియోజకవర్గ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. నియోజకవర్గంలో ప్రజలంతా వినా యకుని ఆశీస్సులతో సుఖ సంతోషాలతో దినదినాభి వృద్ధి చెందాలని ఆకాంక్షించారు.
ఎమ్మెల్యే మాట్లాడుతూ …వినాయక చవితి పండుగను భక్తిశ్రద్ధలతో జరుపుకోవాలని ఆకాంక్షించారు. మట్టి వినాయకుడే మహాగణపతి అని పర్యావరణాన్ని పరిరక్షించే మట్టి విగ్రహాలని ఉపయోగించాలని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు. మీరు తలపెట్టిన ప్రతి కార్యం గణనాధుని ఆశీస్సులతో విజయం సిద్ధించాలని విఘ్నాలు కలగకుండా కాపాడాలని వినాయకుని ప్రార్థిస్తున్నట్లు ఆయన ఆశీస్సులు మీకు, మీ కుటుంబ సభ్యులకు ఉండాలని కోరుకుంటూ వినాయక చవితి పండుగ సంతోషంగా జరుపుకోవాలని కోరుకుంటున్నట్లు తెలిపారు

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *