*JSDM-ప్రకాశం-త్రిపురాంతకం ప్రతినిధి* :
ప్రకాశం జిల్లా, త్రిపురాంతకం మండలం, గణపవరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు పదోన్నతిపై, ప్రధానోపాధ్యాయులుగా వచ్చిన *గోపనబోయిన ఏడుకొండలు* ను ఐక్య వేదిక వారు ఘనంగా సన్మానించినారు.
ప్రకాశం జిల్లా, మద్దిపాడు మండలం తెల్లబాడు నుండి, ప్రకాశం జిల్లా త్రిపురాంతకం మండలం గణపవరం గ్రామం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులుగా పదోన్నతి పొందిన *గోపనబోయిన ఏడుకొండలు* ను, ఆంధ్రప్రదేశ్ Sc St Bc&మైనారిటీస్ ఐక్యవేదిక సభ్యులు నేడు ఘనంగా సన్మానించినారు. ఐక్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు జ్యోతి రమేష్ బాబు మాట్లాడుతూ…. ఏడుకొండలు మాస్టర్ ఎక్కడ పనిచేసినా, విద్యార్థుల అభ్యున్నతికి పాటుపడే వ్యక్తి అని, పని చేసిన ప్రతి చోటా, తోటి ఉపాధ్యాయుల మన్ననలను, విద్యార్థుల ప్రేమ ఆప్యాయతలను పొందేవారని ఇలాంటి ఉన్నతమైన ఉపాధ్యాయులు ఇంకా మరెన్నో పదోన్నతులు పొందాలని ఆయన అన్నారు.
ఈ కార్యక్రమం లో హైస్కూల్ ఉపాధ్యాయ బృందం, అద్దంకి BSP అధ్యక్షులు మందా జోసఫ్, ఐక్య వేదిక ప్రకాశం జిల్లా ఉపాధ్యక్షులు ఇస్తర్ల వెంకటసుబ్బారావు, కొమ్మాలపాటి బుజ్జి, ఉపాధ్యాయులు బత్తుల భాస్కరరావు, మందా నరేష్, గ్రామస్తులు, విద్యార్థులు పాల్గొన్నారు.

