ముండ్లమూరు మండలం లో ఘనంగా వినాయక చవితి

ముండ్ల మూరుమండలంలోని పలు గ్రామాల్లో వినాయక చవితి పర్వదినాన్ని సోమవారం ఘనంగా నిర్వహించారు. పసుపుగల్లు, రమణారెడ్డి పాలెం, వేముల బండ, శ్రీనివాస నగర్, పూరి మెట్ల, శంకరాపురం, ముండ్లమూరు గ్రామాలలో దేవాలయ వద్ద బస్టాండ్ల వద్ద ప్రత్యేకంగా షామియానాలు , పందిర్లుఏర్పాటు చేసి వినాయక విగ్రహాల ముందు రకరకాల విద్యుత్ ఎలక్ట్రికల్ బోర్డులు ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. వినాయక విగ్రహాల వద్ద వివిధ రకాల పండ్లు, పత్రి, పిండి వంటలు తీసుకువెళ్లి స్వామివారికి నైవేద్యం సమర్పించారు. వర్షాలు సకాలంలో కురిసి పంటలు పండి అన్ని గ్రామాల్లో ప్రజలు సుఖశాంతులతో ఉండాలని గణనాథుడిని మొక్కుకున్నారు. ఆయా గ్రామాల్లో యువకులు పెద్దలు మహిళలు పూజ కార్యక్రమాల్లో పాల్గొన్నారు ఈ కార్యక్రమం పసుపుగల్లు మాజీ సర్పంచ్ చింతా శ్రీనివాస్ రెడ్డి, ఉప సర్పంచ్ బిజ్జం జ్యోతి కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *