వైసీపీ మండల కన్వీనర్ బిజ్జం వెంకటసుబ్బారెడ్డి ఆధ్వర్యంలోబొజ్జ గణపయ్యకు ఘనంగా పూజలు

విఘ్నాలు తొలగించి మహాగణపతి ఆశీస్సులు ప్రజలపై ఉండాలని వైసీపీ మండల కన్వీనర్ బిజ్జం వెంకటసుబ్బారెడ్డి పేర్కొన్నారు. మండలంలోని పసుపుగల్లు గ్రామంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన గణనాధుని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా సుబ్బారెడ్డి మాట్లాడుతూ …గణనాథుడు చల్లని చూపు ప్రజలందరిపై ఉండాలని, ఆ మహా దేవుని ఆశీస్సులతో ప్రజలందరూ ఆయురారోగ్యాలతో పాడి పంటలతో సిరి సంపదలతో సుభిక్షంగా ఉండాలని ఆ దేవుని నీ వేడుకుంటున్నాను అని తెలిపారు. కార్యక్రమంలో ఫీల్డ్ అసిస్టెంట్ చింతా వెంకట శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *