గ్రామాల్లో ఏర్పాటు చేసిన వినాయక విగ్రహాల వద్ద జాగ్రత్త లు తప్పనిసరిగా పాటించాలని ఎస్సై యు వి కృష్ణయ్య అన్నారు. ముండ్లమూరు మండలంలోని భీమవరం, పూరిమెట్ల,ఉమామహేశ్వరపురం, ఈదర, బీవీ పాలెం, తదితర గ్రామాలలో మంగళవారం ఆయన వినాయక విగ్రహాలను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ … వినాయక విగ్రహాల కమిటీ వారు వర్షాలు కురిసే సమయంలో జాగ్రత్త తీసుకోవాలని, విగ్రహాలకు ఏర్పాటుచేసిన విద్యుత్ విషయంలో పలు జాగ్రత్త లు తీసుకోవాలని అన్నారు. ఎవరైనా విగ్రహాలకు అనుమతులు తీసుకోపోతే ఇప్పటికైనా అనుమతులు తీసుకోవాలని ఆయన కోరారు. గ్రామాల్లో ఘర్షణలకు తావు లేకుండా ఎవరికి వారే సమన్వయం పాటించి ఎలాంటి విభేదాలు లేకుండా పండుగ జరుపుకోవాలని కోరారు. కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
