తాళ్లూరు మండలంలోని వెలుగు వారి పాలెం గ్రామంలో రోడ్లకు ఇరువైపులా గల ముళ్ళ చెట్లను తొలగింపు పనులు బుధవారం ప్రారంభించారు .ఒంగోలు పార్లమెంటు సభ్యులు మాగుంట సహాయ సహకారాలతో ప్రత్యేక ప్రోక్లైన్ ద్వారా ప్రధాన రహదారి ,ఇతర రహదారులకు ఇరువైపులా ఉన్న ముళ్ళ చెట్లను తొలగించి రహదారి ప్రయాణానికి అనుకూలంగా ఉండే విధంగా చిల్ల చెట్లను తొలగింపు పనులు చేపట్టారు. గ్రామ సర్పంచ్ బ్రహ్మ రెడ్డి ఆధ్వర్యంలో వైసీపీ నాయకులు ,కార్యకర్తలు జెసిబి ద్వారా ముళ్ళ చెట్లను తొలగించి రహదారులను శుభ్రపరిచే విధంగా చర్యలు చేపట్టారు .గ్రామంలోని రోడ్ల ఇరువైపుల ముళ్ళ చెట్లను తొలగింపు కార్యక్రమంలో సహకరించిన ఒంగోలు పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాస్ రెడ్డి సహాయ సహకారాలు మరువలేనివని ఆయనకు గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు.
