ముండ్లమూరు ఖరీఫ్‌లో సాగు చేసిన 30 ,40 రోజుల వరి పైరులో కాండం తొలుచు పురుగు, కాండం కుళ్ళు ఆశించిందని మండల వ్యవసాయ అధికారి ఎండి ఫారుక్ అన్నారు. మండలంలోని పోలవరం గ్రామంలో బుధవారం వరి పైరు ,కంది పంటను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాండం తొలుచు పురుగు నివారణకు కార్టఫ్ హైడ్రోక్లోరైడ్ ఫోర్ జి ఎకరానికి 400 గ్రాములు, హెక్స కోణాజోల్ ఎగరానికి 400 మిల్లీమీటర్ల చొప్పున పిచికారి చేసుకోవాలని ఆయన తెలిపారు. మొదటి దఫ్ఫా యూరియా డిఎపి ఎరువులను వాడిన తర్వాత, రెండవ దఫాగా కాంప్లెక్స్ ఎరువులను పైపాటుగా వాడటం తగ్గించాలని రైతులకు సూచించారు.2023 ఖరీఫ్ ఈ పంట నమోదులో చేసుకొనే రైతులు ఈనెల 30వ తేదీ వరకు గడువు పొడిగించారని రైతులు ఈ అవకాశాన్ని సద్విని చేసుకోవాలన్నారు. అలాగే ఈ కేవైసీ కూడా చేయించుకోవాలన్నారు. ఇప్పటివరకు 55 80 ఎకరాలు, 25 45 మంది రైతులు నమోదు చేయించుకున్నారని తెలిపారు. వంట నమోదు చేయించుకోలేని రైతులు దరఖాస్తు చేసుకొని ఈనెల 30 తేదీ లోపు పంట నమోదు చేయించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో వీఏ ఏ గజ్జ ప్రదీప్ . రైతులు పాల్గొన్నారు.
