తురకపాలెం వైఎస్సార్సీపీ నాయకుడు కుమ్మిత జయరామిరెడ్డి ఇటీవల ప్రమాదంలోకాలుకి గాయం కావటంతో చికిత్స పొంది నివాసం వద్ద విశ్రాంతి తీసుకుంటున్నాడు. విషయం తెలిసిన వైఎస్సార్సీపీ తాళ్లూరు మండల ఇన్చార్జి మద్దిశెట్టి రవీంద్ర,ఎంపీపీ తాటికొండ శ్రీనివాసరావు, జెడ్పీటీసీ మారం వెంకట రెడ్డి, కోఆప్షన్ మెంబర్ కరిముల్లా, బెల్లం కొండ వారి పాలెం సర్పంచి పీఎస్ శ్రీకాంత్ రెడ్డి, గంగి రెడ్డి పాలెం యలమందా రెడ్డిలతో కలసి వెళ్లి పరామర్శించారు. ప్రమాదం జరిగిన తీరు, చికిత్స విధానాన్ని జయరామిరెడ్డి వివరించారు. తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
