తాళ్లూరు మండల సీనియర్ జర్నలిస్ట్ సుసుర్ల నరేంద్ర నాథ్ ను ఎమ్మెల్యే డాక్టర్ మద్దిశెట్టి వేణుగోపాల్ అన్న తాళ్లూరు మండల వైఎస్సార్సీపీ ఇన్చార్జి మద్దిశెట్టి రవీంద్ర పరామర్శించాడు. నరేంద్ర నాథ్ ఇటీవల బ్లాడర్ ఆపరేషన్ చేయించి నివాసం వద్ద విశ్రాంతి తీసుకుంటున్నాడు. విషయం తెలిసిన వైఎస్సార్సీపీ తాళ్లూరు మండల ఇన్చార్జి మద్దిశెట్టి రవీంద్ర, ఎంపీపీ తాటికొండ శ్రీనివాసరావు, జెడ్పీటీసీ మారం వెంకట రెడ్డి, కోఆప్షన్ మెంబర్ కరిముల్లా, బెల్లం కొండ వారి పాలెం సర్పంచి పీఎస్ శ్రీకాంత్ రెడ్డి, గంగి రెడ్డి పాలెం యలమందా రెడ్డిలతో కలసి వెళ్లి పరామర్శించారు. ఆరోగ్య పరిస్థితిని, చికిత్స విధానాన్ని జర్నలిస్ట్ నరేంద్ర వివరించారు. తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
