ప్రజాధరణం చూసి ఓర్వలేకే ….. అక్రమ కేసులు ,అరెస్టు లు -8వ రోజు దీక్షలో మాజీ ఎమ్మెల్యే డాక్టర్ ఉగ్ర

మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు ప్రజల్లో పెరుగుతున్న ఆదరణ చూసి ఓర్వలేక జగన్ రెడ్డి అక్రమ కేసులతో బాబును వేధిస్తున్నారని మాజీ ఎమ్మెల్యే, టీడీపీ ఇన్చార్జి డాక్టర్ ఉగ్ర నరసింహారెడ్డి అన్నారు. ఆధ్వర్యంలో బుధవారం అమరావతి గ్రౌండ్స్లో జరిగిన 8వ రోజు దీక్షల్లో రైతులు పెద్ద ఎత్తున పాల్గొని చంద్రబాబు అక్రమ అరెస్టుకు నిరసనగా మద్దతు తెలిపారు. డాక్టర్ ఉగ్ర మాట్లాడుతూ… టీడీపీ హయాంలో ఎంతో మంది యువతకు స్కిల్ డెవలెప్మెంట్ పెంపొందించి చంద్రబాబు వారికి ఉపాధి అవకాశాలు కల్పించారన్నారు. ఆ సమయంలో నైపుణ్య శిక్షణ పొంది లక్షలాది మంది సాఫ్ట్వేర్ ఉద్యోగాలుచేసుకుంటున్నారన్నారు. దీనిపై కట్టుక థలు అల్లి, తప్పుడు కేసులతో చంద్రబాబును వైసీపీ పాలకులు అరెస్టు చేశార న్నారు. రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం ప్రభంజనాన్ని ఎవరూ ఆపలేరన్నారు. ముందుగా మాజీ ఎమ్మెల్యే ఇరిగినేని చిత్రపటానికి నివాళులర్పించారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *