అమెరికాసంఘం,ప్రపంచ వేదిక తెలుగుతానాసాహిత్య ఈనెల 24వ తేదీన,ప్రతిష్టాత్మకంగానిర్వహిస్తున్న నారీ సాహిత్య భేరీ అంతర్జాతీయ శతాధిక కవయిత్రుల సమ్మేళనానికి జిల్లాకు చెందిన ప్రముఖ కవయిత్రి, నవ్యాంధ్ర రాష్ట్ర రచయిత్రుల సంఘం (నరసం) రాష్ట్ర ఉపాధ్యక్షురాలు సింహాద్రి జ్యోతిర్మయిని ప్రత్యేక అతిథిగా ఆహ్వానించారు. ప్రతిష్టాత్మక మైన కార్యక్రమంలో కవిత్వం వినిపించేందుకు తనకు స్థానం కల్పించినందుకు తానా అధ్య క్షుడు నిరంజన్ శంగవరపు, తానా ప్రపంచ సాహిత్య వేదిక నిర్వాహకులు డాక్టర్ ప్రసాద్ తోటకూర, సమన్వయకర్త చిగురుమళ్ల శ్రీని వాసికి ఆమె ధన్యవాదాలు తెలియజేశారు. 14 గంటల పాటు నిర్విరామంగా జరిగే ఈ సాహిత్య సమ్మేళనంలో భారత్ తో పాటు విశ్వ వ్యాప్తంగా సుమారు 15 దేశాలకు చెందిన ప్రముఖ తెలుగు కవయిత్రులు, రచయిత్రులు, వీరితో పాటు ప్రముఖ మహిళలు పాల్గొం టారు. జ్యోతిర్మయికి ఈ అవకాశం రావడంపై నరసం రాష్ట్ర గౌరవాధ్యక్షురాలు తేళ్ల అరుణ, అధ్యక్షురాలు చిన్నలక్ష్మి కళావతి, ప్రధాన కార్య దర్శి పాతూరి అన్నపూర్ణ, నాగభైరవ ఆదినారాయణ, డాక్టర్ నూనె అంకమ్మరావు, కుర్రా ప్రసాద్ బాబు హర్షం వ్యక్తం చేసి తమ అభినం దనలు తెలిపారు.
