జగనన్న గ్రహాల నిర్మాణాలు త్వరిత గతిన పూర్తి చేయా లని గృహ నిర్మాణ శాఖ డీఈ నిరీక్షణ రావు తెలిపారు. తాళ్లూరు మండలంలోని మల్కాపురం పంచాయతీ పరిధి రాజానగరం వద్ద జగనన్న లేఅవుట్లో గృహాల నిర్మాణాల తీరును బుధవారం ఆయన పరిశీలించారు. లబ్ధిదారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. లబ్ధిదారులకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా చూస్తామని పేర్కొన్నారు. బిల్లులు త్వరితగతిన అంది స్తున్నామని, నిర్మాణాలకు ఉపయోగపడే విధంగా నియమిత మోతాదుల ప్రకారం ఇనుము, సిమెంటు సరఫరా చేస్తామని చెప్పారు. సర్పంచి కాలేషావలి,ఏఈ కోటిరెడ్డి, పలువురు సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

