ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో తాళ్లూరులో గురువారం ఆందోళన నిర్వహించారు. బిజేపి ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ బిల్లును ప్రవేశ పెట్టాలని లేదంటే రాబోవు రోజులలో తీవ్రంగా ఆందోళన చేపడతామని మహాజన సోషలిస్ట్ పార్టీ, ఎంఆర్పీఎస్ నాయకులు అన్నారు. రాజు పల్లి ఆంజనేయులు, మహాజన సోషలిస్ట్ పార్టీ జిల్లా అధ్యక్షుడు అధ్యక్షుడు తోరటి ఆనంద్, అనపర్తి సంతోష్, సిద్దయ్య, యోహాన్, అభిషేన్, చిన బ్రహ్మయ్య, చిన శేషయ్య, ఆదిబాబు, ఏసు రత్నం, కళ్యాణ్, మరియదాస్, పరిశుద్దరావు, వెంకట రామయ్య తదితరులు పాల్గొన్నారు.
