దేశాభివృద్ధిలో మహిళలది ప్రధానపాత్ర – దారా సాంబయ్య.మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదంపై హర్షం.మోడీ చిత్రపటానికి పాలాభిషేకం.

గత 30 సంవత్సరాలుగా కేంద్రంలో ఉన్న ఏ రాజకీయ పార్టీ సాధించని విజయాన్ని పార్లమెంట్లో భారతీయ జనతా పార్టీ, ప్రధాని నరేంద్ర దామోదర్ దాస్ మోడీ సాధించారని, మహిళా సాధికారతకు ప్రధాని ఎన్నో పథకాలను రూపొందించి, స్కీములను ఏర్పాటు చేసి దేశంలోని మహిళామూర్తులకు ఎనలేని సేవ చేస్తున్నారని వానిలో భాగంగా ఈనాడు నూతన పార్లమెంట్ భవనంలో తొలిసారి ప్రవేశపెట్టిన 33 శాతం మహిళా రిజర్వేషన్ బిల్ అత్యంత అధిక సభ్యుల ఆమోదంతో పాస్ కావడం మోదీ అద్వితీయ మేదో సంపత్తికి నిదర్శనం అని మాజీ శాసనసభ్యులు భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు దారా సాంబయ్య పేర్కొన్నారు. గురువారం మంగమూరు డొంక లోని తమ ఇంటి వద్ద ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో దారా సాంబయ్య మాట్లాడుతూ 30 సంవత్సరాలుగా పార్లమెంట్లో ఆమోదం చెందించుకోలేని ప్రతి ఒక్కరు మహిళా బిల్లు మాదని చెప్పుకోవడం సిగ్గుచేటైన విషయం అన్నారు. ఒక పక్క దేశంలో కాంగ్రెస్ మరోపక్క తెలంగాణలోని బిఆర్ఎస్ నాయకులు మా పోరాటపటిమతో మహిళా బిల్ పెట్టడం జరిగిందని వొట్టి గొప్పలు చెప్పుకోవడం హాస్యాస్పదంగా ఉందన్నారు. కచ్చితంగా రాబోవు ఎన్నికల్లో కేంద్రంలో మరోమారు బిజెపి ప్రభుత్వం వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. అనంతరం మోడీ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. కార్యక్రమంలో ప్రకాశం జిల్లా ఇంచార్జ్ పునుగుల రవిశంకర్, ఒంగోలు పార్లమెంట్ కన్వీనర్ సెగ్గం శ్రీనివాసరావు, జిల్లా ప్రధాన కార్యదర్శులు కోరంకి శ్రీనివాసరావు, శివాజీ యాదవ్, భారతీయ జనతా పార్టీ ప్రకాశం జిల్లా మహిళా మోర్చా జిల్లా ఇంచార్జ్ తిగల సత్యవతి, జిల్లా ఉపాధ్యక్షురాలు జజ్జర కృష్ణవేణి, జిల్లా కార్యదర్శి జువ్విగుంట కోటేశ్వరి,జిల్లా కార్యదర్శి బసనేపల్లి రాజశేఖర్ యువమోర్చ నాయకులు దామోదర్, భారతీయ జనతా పార్టీ ప్రకాశం జిల్లా మీడియా ఇంచార్జ్ ధనిశెట్టి రామునాయుడు మరియు స్థానిక మహిళలు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *