విద్యార్థులు అవగాహనతో ముందుకు సాగాలి

విద్యార్థులు అవగాహనతో ముందుకు సాగితే విజయం తధ్యమని పేస్ కళాశాల సెక్రటరీ అండ్ కరస్పాండెట్ డాక్టర్ మద్దిశెట్టి శ్రీధర్ అన్నారు. స్థానిక పేస్ కళాశాలలో గురువారం త్రిపుల్ ఐటీ విద్యార్థులకు “ఏంజెల్ పెట్టుబడి మరియు వెంచర్ క్యాపిటల్ ఫడింగ్ ” అవకాశం అనే అంశంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఎంబీసీ డిపార్ట్మెంట్ అసోషియేట్ ప్రొఫెసర్ డాక్టర్ టి ఎలియా మాట్లాడుతూ …ఎపీ ఎఎసీఎఫ్ అవకాశం యొక్క ప్రాముఖ్యతను లాభాలను వివరించారు. ప్రిన్సిపాల్ డాక్టర్ జివికె మూర్తి మాట్లాడుతూ విద్యార్థులకు ప్రాధమికంగా అవగాహన సదస్సులు భవిష్యత్లో చక్కగా ఉపయోగపడతాయని చెప్పారు. ట్రిపుల్ ఐటీ విభాగ అధిపతి నాగరాజు, కో కన్వినర్ డాక్టర్ సీహెచ్ జగదీశ్వర రెడ్డి, కోఆర్డినేటర్ బి వెంకటేష్, అధ్యాపక బృందం పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *