పశుసంవర్థక శాఖ జిల్లా అధికారి బేబి రాణి శుక్రవారం బొద్దికూరపాడు సచివాలయ పరధిలో పశుసంవర్ధక శాఖ అందుతున్న సేవలను అకస్మికంగా తనిఖీ చేసారు. పశుసంవర్ధక శాఖ ద్వారా అందిస్తున్న పలు సేవలను జీవాల పెంపకం దార్లు, పశుపోషకులను అడిగి తెలుసుకున్నారు. నట్టల నివారణ మందులు, రోగ నిరోధక టీకాలు సకాలంలో అందిస్తున్నారా అని తెలుసుకున్నారు. పశుసంవర్ధక శాఖ అందిస్తున్న ఆయా సేవలపై సంతృప్తి వ్యక్తం చేసారు. పశుసంవర్ధక శాఖ తూర్పు గంగవరం పశువైద్యుడు డాక్టర్ రాంబాబు, సిబ్బంది పాల్గొన్నారు.

