బిజేపి డాక్టర్స్ సెల్, యువమోర్చా ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం.

భారత ప్రధాని నరేంద్ర దామోదర్ దాస్ మోడీ జన్మదిన సేవా పక్షోత్సవాలలో భాగంగా భారతీయ జనతాపార్టి డాక్టర్స్ సెల్ మరియు యువమోర్చా ఆధ్వర్యములో సెప్టెంబర్ 23వ తేదీ శనివారం ఉదయం 10 గంటలకు ఒంగోలు నగరంలోని స్థానిక కేశవనగర్ ఇందిరా ప్రియదర్శిని లా కళాశాల ప్రాంగణంలో మెగా రక్తదాన శిబిరం నిర్వహిస్తున్నట్లు భారతీయ జనతా పార్టీ ప్రకాశం జిల్లా అధ్యక్షులు పీవీ శివారెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. సెప్టెంబర్ 17 ప్రధాని మోదీ జన్మదినోత్సవ సందర్భంగా పక్షంరోజులపాటు వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, వానిలో భాగంగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరుగుచున్నదని, మోదీ అభిమానులు, పార్టి కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *