వైఎస్ఆర్సిపి పాలనలో అక్రమ కేసులలో చంద్రబాబు నాయుడు ను ఇరికించిన మాత్రాన తెలుగుదేశం పార్టీని అడ్డుకోలేరని మండల టిడిపి అధ్యక్షులు కూరపాటి శ్రీనివాసరావు అన్నారు. మండలంలోని వేంపాడు గ్రామంలో శుక్రవారం బాబుతో నేను అనే కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లక్ష కోట్లు అవినీతిలో నాడే ఉమ్మడి రాష్ట్రాన్ని దోచేసి 16 నెలలు జైల్లో ఉన్న వ్యక్తి వైయస్ జగన్ అని అన్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసం, యువత భవిష్యత్తు కోసం నిత్యం తపించే చంద్ర బాబు నాయుడు పై రాజకీయ కక్షతో అక్రమ కేసు పెట్టి ఆధారాలు లేని ఆరోపణలతో జైల్లో పెట్టారని అన్నారు. దేశం గర్వించే నేత చంద్రబాబుని జైల్లో పెట్టాలని కక్షతోనే జైల్లో పెట్టించారని అన్నారు. సాగునీటి ప్రాజెక్టుల విధ్వంసం పై యుద్ధభేరి, 40 వేల కోట్ల ఇసుక దోపిడీ చేశారని అన్నారు. కరెంటు చార్జీలు పెంచి, నిరుద్యోగం, అన్నదాత కష్టా లు, బడుగు వర్గాలపై దాడులు చేయించారని అన్నారు. అనంతరం వేంపాడు గ్రామంలో బాబుతో నేను కరపత్రాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మేదరమెట్ల కొండలరావు, గంగినేని శేషగిరిరావు, మేదరమెట్ల రమేష్, సర్పంచి వద్దిపోగురవయ్య, గ్రామస్తులు పాల్గొన్నారు.


