ఘనంగా గణనాథుడి నిమజ్జనం

ముండ్లమూరు మండల కేంద్రమైన ముండ్ల మూరుతోపాటు భీమవరం,ఈదర , బంగారమ్మ గుట్ట, ముండ్లమూరు, చింతలపూడి, పోలవరం, రాజగోపాల రెడ్డి నగర్, గంగన్న పాలెం, కెల్లంపల్లి, వేముల, తమ్మలూరు, ఉల్లగల్లు గ్రామాలలో శుక్రవారం నిమజ్జన కార్యక్రమాలు అత్యంత వైభవంగా నిర్వహించారు. భక్తులు ఐదు రోజులు పాటు వినాయకుని వద్ద పూజా కార్యక్రమాలు అందుకున్నారు. పూజారి దుర్భాకుల నగేష్ శర్మమంత్రోచ్ఛరణల మధ్య పూజా కార్యక్రమాలు నిర్వహించారు. వినాయక విగ్రహం వద్ద ఉన్న పది కేజీల లడ్డుకు వేలంపాట నిర్వహించగా ముళ్ళమూరు గ్రామానికి చెందిన మాజీ సైనికుడు బొల్లెపల్లి హనుమంతరావు 8700 రూపాయలకు పాట పాడి పాట కైవసం చేసుకున్నాడు. ఈ గణనాథుడు బీసీ సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు.నిమజ్జనం సందర్భంగా ఊరేగింపు సందర్భంగా ట్రాక్టర్ పై వినాయక విగ్రహాన్ని ఏర్పాటు చేసి గ్రామ పురవీధుల్లో కలియతిరిగారు. మహిళలు స్వామివారికి వారు పోస్తూ ప్రత్యేక పూజలు చేశారు. విగ్రహం ఊరేగింపు సందర్భంగా మేళ తాళాల మధ్య. డిజె సౌండ్ సిస్టం తో యువకులు కేరింతలు కొడుతూ డాన్స్ లు చేశారు. అనంతరం ఊరు చివరన గల అద్దంకి దర్శిరహదారి పక్కన గల చిలక లేరు వాగులో నిమజ్జనం చేశారు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు, ప్రమాదాలు జరగకుండా ముండ్లమూరు ఎస్సై యు.వి కృష్ణయ్య ఆధ్వర్యంలో పోలీసులు అప్రమత్తం చేశారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *