భారత ప్రధాని నరేంద్ర దామోదర్ దాస్ మోడీ జన్మ దినోత్సవం సెప్టెంబర్ 17 సందర్భంగా భారతీయ జనతా పార్టీ అక్టోబర్ రెండు గాంధీ జయంతి వరకు నిర్వహిస్తున్న సేవాపక్షోత్సవాల్లో భాగంగా 23వ తేదీ శనివారం స్థానిక కేశవ నగర్ లోని ఇందిరా ప్రియదర్శిని లా కాలేజీ ప్రాంగణంలో బిజెపి డాక్టర్స్ సెల్ మరియు యోమోర్చా ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా ప్రధాని 73వ పుట్టినరోజుకు గుర్తుగా లా కళాశాల ప్రాంగణంలో 73 మొక్కలను నాటారు. స్థానిక ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ మరియు రిమ్స్ బ్లడ్ బ్యాంక్ ల సహకారంతో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరం లో లా కళాశాల విద్యార్థులు, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు 53 మంది రక్తదానాన్ని చేశారు. పలువురికి స్ఫూర్తినిచ్చేవిధముగా మహిళలు సైతం రక్తదానం చేయడం విశేషం.
ఈ సందర్భంగా లంకా దినకర్ మాట్లాడుతూ మోదీ జన్మదినోత్సవ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా 14 రోజులు పాటు వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, బిజెపి ఒక రాజకీయ పార్టీ గానే కాకుండా బాధ్యతాయుతంగా ప్రజలకు సేవ చేయాలనే సదుద్ధేశ్యముతో ముందుకు సాగుతున్నామని తెలిపారు. ఈ సేవా పక్షోత్సవాల్లో భాగంగా పలు సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఇతర పార్టీలకు ఆదర్శప్రాయంగా ఉండేటట్లు పని చేస్తున్నామన్నారు. ఏదైతే మోదీ గారి స్ఫూర్తి రక్తదానం ప్రాణదానంతో సమానం ఉందో దానికి అనుగుణముగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేశామని, అవసరమైన వారికి రక్తం అందించడం వల్ల వారికి జీవితం అందించడమేయని, రక్తదానాన్ని ప్రోత్సహించడానికి ఈ కార్యక్రమం ఉపయోగపడుతుందన్నారు.
ఈ కార్యక్రమములో కళాశాల ప్రిన్సిపల్ ఆలూరి రామకృష్ణారావు, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి లంకా దినకర్, జిల్లా ఇంఛార్జ్ రవిశంకర్, రాష్ట్ర నాయకులు బొద్దులూరి ఆంజనేయులు, శెగ్గం శ్రీనివాసరావు, పొగాకు బోర్డు మెంబర్ బొడపాటి బ్రహ్మయ్య, ఆంధ్ర కేసరి విద్యాసంస్థ పాలకమండలి సభ్యులు మండవ నాగేశ్వరరావు, బత్తిన మహేష్, డాక్టర్స్ సెల్ కన్వీనర్ కొమ్మి నర్సింగరావు, బిజెపి జిల్లా అధ్యక్షులు పివి శివారెడ్డి, యువమోర్చా నాయకులు దామోదర్, నాయక్, రాజేష్ వర్మ, మైనార్టీ మోర్చా మాజీ రాష్ట్ర అధ్యక్షులు కలిఫైతుల్లా బాషా, మాజీ జిల్లా అధ్యక్షులు పివి కృష్ణారెడ్డి, నాగేంద్ర యాదవ్, శివాజి యాదవ్, కుకట్ల నాగేశ్వరరావు, కొమ్ము శ్రీనివాసరావు, గుర్రం సత్యనారాయణ, పిన్నంటి తిరుమల రావు, బసినేపల్లి రాజశేఖర్, కుంచాల వెంకట శివ, మీనాకుమారి, గీతాంజలి, సత్యవతి, కోటేశ్వరి, కృష్ణవేణి మరియు జిల్లా మీడియా ఇంఛార్జ్ ధనిశెట్టి రామునాయుడు తదితర పార్టీ పదాధికారులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.



