విద్యార్థులు క్రీడా స్పూర్తితో పోటీలలో పాల్గొనాలని జిల్లా పరిషత్ కోఆప్షన్ మెంబర్ షేక్ ఆదాం షరీఫ్ (బుజ్జి) అన్నారు. తూర్పుగంగవరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శనివారం జిల్లా స్థాయి వ్యాండ్ బాల్ జట్ల ఎంపిక పోటీలునిర్వహించారు. జిల్లా కో ఆప్షన్ మెంబర్ ఆదాం షరీఫ్(బుజ్జి) ముఖ్య అతిథిగా పాల్గొని పోటీలను ప్రారంభించారు. ఇన్చార్జి ప్రధానోపాధ్యాయుడు సీహెచ్ శ్రీనివాసరావు అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ప్రధానోపాద్యాయుడు శ్రీనివాసరావు మాట్లాడుతూ…. జిల్లా స్థాయిలో జరుగుతున్న పోటీలలో ఎంపిక అయిన వారు రాష్ట్ర స్థాయిలో ఈనెల 28న జరుగు పోటీలలో పాల్గొంటారని చెప్పారు. కార్యక్రమంలో ఎంఈఓ జి. సుబ్బయ్య, ఎస్ఎంసీ చైర్మన్ రాజశేఖర్ రెడ్డి, పీడీ విజయకుమార్, పీఈఓ పై శ్రీనయ్య, ప్రసాద్, క్రిష్ణా, గ్రామ నాయకులు గుజ్జుల యోగి రెడ్డి, జి తిరుపతి రెడ్డి, సుబ్బారావు, జక్కుల రామక్రిష్ణ తదితరులు పాల్గొన్నారు.
