ఘనంగా గణపయ్యకు వీడ్కోలు

వినాయక చవితి పండుగ సందర్భంగా భక్తులు ముండ్లమూరు మండలంలోని అన్ని గ్రామాలలోని పలు వీధులలో వినాయకుడి విగ్రహాలను ఏర్పాటు చేశారు. భక్తిశ్రద్ధలతో శనివారం వినాయకుడి విగ్రహాలను నిమజ్జనానికి తరలించారు. వినా యకుడి విగ్రహాలను ట్రాక్టర్ పై ఏర్పాటుచేసి గ్రాములోని పలు వీధుల గుండా తిరుగుతూ భక్తులకు దర్శనమిస్తూ వినాయకుడికి వారు పోస్తూ మహిళలు పూజలు చేశారు. ఆరు రోజులు పాటు ప్రత్యేక పందిళ్లు ఏర్పాటు చేసి, వినాయకుడి విగ్రహాలను మేళ తాళాల మధ్య డీజే సౌండ్ స్పీకర్ల మధ్య యువకులు మహిళలు కేరింతల కొడుతూ డాన్స్ లు వేస్తూ సందడి చేశారు. ఒకరిపై ఒకరు గులాములు చల్లుకుంటూ ఆనంద డోలికల్లో మునిగితేలారు. వినాయకుడి వద్ద ఉన్న రెండు కేజీల లడ్డుకు వేలంపాట నిర్వహించగా ముండ్లమూరుకు చెందిన రాష్ట్ర గ్రీనింగు బ్యూటిఫికేషన్ కార్పొరేషన్ డైరెక్టర్ కుమ్మిత అంజిరెడ్డి 10 వేల116 రూపాయలకు పాట దక్కించుకున్నాడు. వినాయక విగ్రహాన్ని అద్దంకి దగ్గర ఉన్న గుండ్లకమ్మ నదిలో నిమజ్జనం చేశారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *