ముండ్లమూరు( మండలంలోని వేముల పంచాయతీ పరిధిలోని కమ్మవారిపాలెం గ్రామంలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన వినాయకుడు నిమజ్జనం కార్యక్రమం అంగరంగ వైభవంగా శనివారం జరిగింది. వినాయకుడి వద్ద ఉన్న 16 కేజీల లడ్డు వేలంపాట నిర్వహించగా గ్రామానికి చెందిన కాట్ల వెంకటేశ్వర్లు 65000వేలకు పాట దక్కించుకున్నాడు. వినాయక విగ్రహాన్ని వేముల గ్రామంలో గల చెరువులో నిమజ్జనం చేయడం జరిగింది. నిమజ్జనం సందర్భంగా ఎవరికి ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా పోలీసు లు అప్రమత్తం చేశారు.
