ఈ- క్రాప్ నమోదు సత్వరమే పూర్తి చెయ్యాలని వ్యవసాయాధికారి ప్రసాదరావు అన్నారు. తాళ్లూరు మండలంలోని దారం వారి పాలెం, తురకపాలెంలలో ఆయన శనివారం పర్యటించారు. వ్యవసాయాధికారి ప్రసాదరావు మాట్లాడుతూ తాళ్లూరు మండలంలో 45 రకాల పంటలను 5715 ఎకరాలు ఈ- క్రాప్లో నమోదు చేసినట్లు చెప్పారు. ఇంకా నమోదు చెయ్యాలని సూచించారు. ఈనెలాఖరు వరకు మాత్రమే నమోదుకు అవకాశం ఉందని, ప్రతి గ్రామ వ్యవసాయ సహాయకుడు చిత్తశుద్దితో పనిచేసి ఈ – క్రాప్ పూర్తి చెయ్యాలని అన్నారు. విఆర్.ఓ నరసింహా, విఏఏలు నాగమల్లేశ్వరి, నవీన్ తదితరులు పాల్గొన్నారు.
