తాళ్లూరు మండలంలో గణనాథుని నిమర్జనోత్సవాలు ఆదివారం ఉత్సాహంగా నిర్వహించారు. వినాయక చవితి నుండి ప్రతి రోజు నిత్య పూజలు అందుకున్న ఆదినాయకుడి కి ప్రజలు ఘనంగా వీడ్కోలు పలికి గంగమ్మ చెంతకు తరలించారు. విఠలాపురం, మాధవరం గ్రామాలలో వెఎస్సార్సీపీ మద్దిశెట్టి యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్వామి వారి విగ్రహాల వద్ద వైఎస్సార్సీపీ తాళ్లూరు మండల ఇన్ చార్జి మద్దిశెట్టి రవీంద్రం ప్రత్యేక పూజలు నిర్వహించారు. వారికి నిర్వాహకులు ఘన స్వాగతం పలికారు. గుర్రంపై ఊరేగించి వారి అభిమానాన్ని చాటు కున్నారు. ఆయా కార్యక్రమాలలో ఎంపీపీ తాటికొండ శ్రీనివాసరావు, జెడ్పీటీసీ మారం వెంకట రెడ్డి, వైస్ ఎంపీపీ ఐ. వెంకటేశ్వర రెడ్డి, కోఆప్షన్ మెంబర్ కరిముల్లా, పలు గ్రామాల సర్పంచిలు పీఎస్ శ్రీకాంత్ రెడ్డి, మాజీ సర్పంచి అంజి రెడ్డి, నాయకులు గంగి రెడ్డి పాలెం యలమందా రెడ్డి, జయ రామి రెడ్డి, జెసీఎస్ కేవీ పాలెం కన్వినర్ విష్ణు తదితరులు పాల్గొన్నారు.






