పౌష్టికాహారం ప్రాముఖ్యతను వివరించి ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ తమ వంతు కృషి చెయ్యాలని వక్తలు అన్నారు. తాళ్లూరు ఐసీడీఎస్ కార్యాలయం ఆవరణలో సోమవారం పౌష్టికాహారం మాసోత్సవాలలో భాగంగా పౌష్ఠికాహార ప్రదర్శన నిర్వహించారు. సీడీపీఓ సీహెచ్ భారతి అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. సీడీపీఓ సీహెచ్ భారతి మాట్లాడుతూ …అంగనవాడీ కేంద్రాలలో తల్లులలకు అంగన్వాడీ టీచర్లు వారి గర్భిణితో ఉన్న సమయం నుండి ఒక స్వంత నివాసంలో ఉన్న వారివలే అన్ని ఆరోగ్యవిషయాలు చెబుతూ మంచి ఆరోగ్యవంతమైన బిడ్డ జన్మకు కృషి చేస్తున్నారని చెప్పారు. వారి సేవలను వినియోగించుకోవాలని కోరారు. మంచి పౌష్టికాహారం తీసుకుని ఆరోగ్యవంతమైన సమాజానికి కృషి చెయ్యాలని కోరారు. తహీల్దార్ ప్రసాద్ మాట్లాడుతూ…. అంగన్వాడీలు వారి పధిలోని బాల్య వివాహాలు జరగకుండా చూడాలని, బాల్యవివాహాల వలన జరిగే అనర్థాలను వివరించారు. ఎంఈఓ జి సబ్బయ్య మాట్లాడుతూ…. నాడు – నేడుతో పాఠశాలలు, అంగన్వాడీలు, వైద్యశాలలు మెరుగైన మౌళిక వసతులు ఏర్పడ్డాయని అన్నారు. గర్భిణి దశ నుండి శిశు, బాల్యం వరకు మెరుగైన సేవలు అందిస్తున్న అంగన్వాడీలనుఅభినందించారు. వ్యవసాయాధికారి ప్రసాదరావు మాట్లాడుతూ …ప్రతి ఒక్కరూ తక్కువ ఖర్చుతో, అధిక పోషకాలు దొరికే చిరుధాన్యాల ఉత్పత్తులను, చిరుధాన్యాలను ఉపయోగించాలని కోరారు. పౌష్టికాహార ప్రదర్శన నిర్వహించారు. గర్భిణిలకు శ్రీమంతం నిర్వహించారు. చిన్నారులకు అక్షరాభ్యాసం చేయించారు. ఎంఈఓ – 2 సుధాకర్ రావు, ఎంపీడీఓ కార్యాలయ పర్యవేక్షకులు శ్రీనివాసరావు, ఎపీఎం దేవరాజ్, సూపర్వైజర్లు సునీత, జ్యోతి, తదితరులు పాల్గొన్నారు.






