ప్రతి అంగన్వాడీ కేంద్రంలో మరుగుదొడ్లు కచ్చితంగా ఉండేలా చర్యలు తీసుకోవాలి -జిల్లా కలెక్టర్ ఏ.ఎస్. దినేష్ కుమార్

ప్రతి అంగన్వాడీ కేంద్రంలో మరుగుదొడ్లు కచ్చితంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఏ.ఎస్. దినేష్ కుమార్ అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్ నుంచి మండల స్థాయిఅధికారులతో సంక్షేమ, అభివృద్ధి అంశాలపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఆర్.డబ్ల్యు.ఎస్. ఏ.ఈ., ఎం.పి.డి.ఓ.లు జిల్లాలో మరుగుదొడ్లు లేని అంగన్ వాడీ కేంద్రాలను గుర్తించి రిపోర్ట్ పంపించాలన్నారు. జలజీవన్ మిషన్లో భాగంగా ఇంటింటికి కుళాయి నిర్మాణ పనులు త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. క్షేత్ర స్థాయిలో ప్రతి ప్రభుత్వ భవనానికి జలజీవని మిషన్ ద్వారా కుళాయిలు కచ్చితంగా నిర్మించాలని కలెక్టర్ చెప్పారు. దీనికి సంబంధించిన ప్రతిపాదనలను పంపించి అనుమతులు పొందాలన్నారు. రూఫ్త్వాటర్ హార్వెస్టింగ్ పనులను వేగంగా పూర్తి చేయాలని ఆయన అన్నారు. వీటికి సంబంధించిన ప్రతిపాదనలు పంపించాలన్నారు. మ్యాజిక్ సోక్ పిట్స్కు, సంబంధించి ప్రతిపాదనలు పంపించాలన్నారు. హౌసింగ్ 90 రోజులకు సంబంధించి కూడా ప్రతిపాదనలు పంపించాలన్నారు. హార్టీకల్చర్ ప్లాన్ టేషన్ ను వచ్చేనెల మొదటి వచ్చేనెల మొదటి వారంలోపు పూర్తిచేయాలన్నారు. ఎవెన్యూ ప్లాంటేషన్ ను వచ్చేనెల రెండో తారీఖున కచ్చితంగా పూర్తిచేయాలని కలెక్టర్ స్పష్టం చేశారు. ఉపాధిహామీ పనులకు సంబంధించిన ఆడిట్ నగదును కచ్చితంగా రికవరీ చేయాలన్నారు.
గ్రామ, వార్డు సచివాలయాలలో సర్వీసులను పెంచాలని కలెక్టర్ చెప్పారు. సచివాలయ సిబ్బంది ఉదయం, సాయంత్రం బయోమెట్రిక్ అటండెన్స్ను కచ్చితంగా వేయాలన్నారు. సర్వీసులకు సంబంధించిన నగదును ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి జమ చేయాలని కలెక్టర్ స్పష్టం చేశారు. ఈ విషయంపై ఎం.పి.డి.ఓ.లు ప్రత్యేక శ్రద్ధ పెట్టాలన్నారు. జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఇంటింటి సర్వేను పూర్తి స్థాయిలో నిర్వహించాలని ఆయన స్పష్టం చేశారు. జగనన్న ఇళ్ల నిర్మాణాలను లక్ష్యాలకు అనుగుణంగా పూర్తి చేయాలన్నారు.
సి.ఈ.ఓ. జాలిరెడ్డి, సి.పి.ఓ. వెంకటేశ్వర్లు, డ్వామా ఈ కార్యక్రమంలో జడ్.పి. సి.ఈ.ఓ. జాలిరెడ్డి, సి.పి.ఓ. పి.డి. శ్రీనారెడ్డి, ఆర్.డబ్ల్యు.ఎస్. ఎస్.ఈ. మర్దన్ అలీ, హౌసింగ్ పి.డి. పేరయ్య, ఇరిగేషన్ ఎస్.ఈ. లక్ష్మారెడ్డి, జి.ఎస్.డబ్ల్యు.ఎస్. అధికారి ఉషారాణి తదితర అధికారులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *