రాష్ట్రంలో అరాచక పాలన సాగుతోంది – టిడిపి అధ్యక్షులు కూరపాటి శ్రీనివాస రావు

రాష్ట్రం అవినీతి లో నిండా మునిగి అరాచక పాలన సాగుతుందని మండల టిడిపి అధ్యక్షులు కూరపాటి శ్రీనివాస రావు అన్నారు. మండలంలోని శంకరాపురం గ్రామంలో మంగళవారం రాత్రి బాబుతో నేను కార్యక్రమం ఆ గ్రామ సర్పంచి కూరపాటి మహేశ్వరి నారాయణస్వామి అధ్యక్షత నా జరిగినది. ఈ సందర్భంగా శ్రీనివాసరావు మాట్లాడుతూ దేశం గర్వించే నేత చంద్రబాబు అని జైల్లో పెట్టాలి అనేకక్ష తప్ప ఆధారాలు ఏమీ లేవని అన్నారు. అవినీతి బురదలో నిండా మునిగిన జగన్ ఆ బురదను అందరికీ అంటించేందుకు పన్నిన కుట్రలో భాగమే స్కిల్ డెవలప్మెంట్ కేసు అని అన్నారు. ఈ కార్యక్రమంలో గంగినేని శ్రీనివాసరావు, బొమ్మి నేని హనుమంతరావు, మందలపు శ్రీనివాసరావు, మేదరమెట్ల రాంబాబు, గంగినేని రామకోటేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *