గ్రామాల్లో పేరుకుపోయిన విద్యుత్ బకాయిల వసూళ్లపై దృష్టి సారించాలని విద్యుత్తు జూనియర్ ఎకౌంట్ ఆఫీసర్ ఎన్ వేణుగోపాల్, విద్యుత్ సీనియర్ అసిస్టెంట్ బి శ్రీనివాసరావు లు అన్నారు. స్థానిక విద్యుత్ సబ్స్టేషన్ లో మంగళవారం పెండింగ్ బకాయిలపై సిబ్బందితో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సకాలంలో విద్యుత్ బిల్లు చెల్లించని వారి సర్వీసులు తొలగించాలని సూచించారు. ఎంతో కాలం నుండి పేరుకుపోయిన విద్యుత్ బకాయిలపై ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. అందులో భాగంగా ముండ్లమూరులో 15 సర్వీసు లు తొలగించి 50వేలు మొండి బకాయిలు వసూలు చేశారు. వేముల బండ గ్రామంలో2 సర్వీసులు తొలగించి 39 వేల మొండి బకాయిల నగదు వసూలు చేయడం జరిగింది అన్నారు. ఈ కార్యక్రమంలో ఎల్ ఐ ఎస్ సాంబయ్య, లైన్ మాన్ పీవీ రామాంజనేయులు, షేక్ మాసూమ్ మస్తాన్, దేవా సొత్తు స్వామి నాయక్, పి మణికంఠ, నాగరాజు, తదితరులు పాల్గొన్నారు.
