ఒంగోలు శ్రీగిరి ప్రాంత వీధులన్నీ గోవింద నామస్మరణతో మార్మోగాయి. శ్రీగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి నీ దర్శించుకోవడానికి శ్రీ గిరి ప్రదక్షణ కమిటీ ఆధ్వర్యంలో శ్రీవారి నక్షత్రం శ్రవణానక్షత్రం రోజు నిర్వహిస్తున్న గిరి ప్రదక్షిణకు మంగళవారం వందలాదిగా భక్తులు తరలివచ్చి శ్రీ గిరి గిరి ప్రదక్షిణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. స్వామి వారి చిత్రపటాన్ని ట్రాక్టర్ తో గ్రామోత్సవంతో భక్తులు గోవింద నామాలు పలుకుతుండగా గిరి ప్రదక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. భక్తి భావనతో వివిధ ప్రాంతాల నుండి భక్తులు విచ్చేసి గిరి ప్రదక్షణ నిర్వహించి అనంతరం స్వామి వారిని దర్శించుకున్నారు. ఉదయం ఐదు గంటలకు జయరాం హాలు వద్దగల శ్రీ బాపూజీ గో సంరక్షణ సంఘం, గోశాలలో గోపూజ నిర్వహించారు. అనంతరం భక్తులు గ్రంథాలయం, కేశవ స్వామి పేట దేవాలయంల మీదుగా శర్మ కాలేజీ రోడ్డు, శర్మ కాలేజ్ క్రికెట్ గ్రౌండ్, గద్దలగుంట బస్టాండ్ మీదుగా గో సంఘం వద్ద నుండి శ్రీగిరి చేరి శ్రీ స్వామివారిని భక్తులు దర్శించారు.
ఈ సందర్భంగా అత్యంత భక్తి భావనతో భక్తులు స్వామివారిని స్మరిస్తూ, ప్రార్ధిస్తూ, కీర్తిస్తూ భజన పాటలు, గోవింద నామాలు పలుకుచూ స్వామివారిని వట్టి కాళ్లతో శ్రీగిరి చేరి స్వామివారిని దర్శించుకొని ఆధ్యాత్మిక చింతనతొ అలౌకిక ఆనందాన్ని పొందారు.
శ్రీగిరి గిరిప్రదక్షిణ కమిటి సభ్యులు కార్యనిర్వాహకులుగా గిరి ప్రదక్షిణ కర్యక్రమం స్వామివారి దర్శనానంతరం ప్రదక్షిణ ముగించారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు మాట్లాడుతూ ….శ్రవణా నక్షత్రం రోజున జరుగుతున్న కార్యక్రమాన్ని పరిశీలించిన స్వామివారి మరో భక్తబృందం పౌర్ణమి రోజున సాయంత్రం 6 గంటలకు శ్రీవారిని దర్శించుకోవడానికి గిరి ప్రదక్షణ మొదలుపెట్టారని, కావున భక్తులందరూ శ్రవణా నక్షత్రం రోజున ఉదయం పూట, పౌర్ణమి రోజున సాయంత్రం పూట శ్రీగిరి గిరి ప్రదక్షిణ గో సంఘం వద్ద నుండి ప్రారంభించి శ్రీగిరి చేరాలని, ప్రతి ఒక్కరూ తమ కుటుంబ బంధుమిత్ర వర్గానికి ఈ కార్యక్రమ విషయాలు తెలిపి జాగృతం చేయాలని విజ్ఞప్తి చేశారు.




