పౌష్టిక ఆహారంతో ఆరోగ్యం పదిలంగా ఉంటుందని సిడిపిఓ సిహెచ్ భారతి అన్నారు. ముండ్లమూరులోని సచివాలయం వద్ద బుధవారం పోషణ మాసత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమం సిడిపిఓ అధ్యక్షతన జరిగినది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఇన్చార్జి ఎంపీడీవో ఎన్ వి ఎల్ హనుమంతరావు హాజరైనారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పౌష్టిక ఆహారం ఎక్కువగా తీసుకుంటే ఆరోగ్యంగా ఉంటారని తెలిపారు. పూర్వం ఎక్కువగా పెద్దలు శారీరక శ్రమ చేసేవారు కనుక ఆరోగ్యంగా ఉండే వారిని అన్నారు. నేడు ప్రతి ఒక్కరు కూడా సౌకర్యవంతంగా ఉండడంతో శారీరక శ్రమ లేకపోవడం తక్కువగా ఉండడం వలన అనారోగ్య సమస్య లు తలెత్తుతున్నాయనిఅన్నారు. మహిళలు గర్భవతులు బాలింతలు బలవర్ధకమైన ఆహారం తీసుకోవడం వలన తల్లి బిడ్డఆరోగ్యంగా ఉంటారని అన్నారు. వైద్యాధికారిణి వి జ్యోతి మాట్లాడుతూ బాల్యవివాహాల తో అనేక అనర్ధాలు ఉన్నాయని, బాల్య వివాహాలను నిరోధించడానికి ప్రతి ఒక్కరు అవగాహన పెంచుకోవాలని అన్నారు అనంతరం అంగన్వాడి కార్యకర్తలు రకరకాల బలవర్ధకమైన ఆహార పదార్థాలతో ప్రదర్శన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ ఆదిలక్ష్మి, కోఆర్డినేటర్ వెంకట్, అంగనవాడి సూపర్వైజర్లు హేమలత, యశోద, జ్యోతి, సుభాషిని, తదితరులు పాల్గొన్నారు.


