జగనన్న కాలనీలలో ఇళ్ల నిర్మాణాలువేగవంతమయ్యేలా తగిన చర్యలు తీసుకోవాలి – జిల్లాకలెక్టర్ ఏ.ఎస్. దినేష్ కుమార్

జగనన్న కాలనీలలో ఇళ్ల నిర్మాణాలువేగవంతమయ్యేలా చర్యలు తీసుకోవాలని జిల్లాకలెక్టర్ ఏ.ఎస్. దినేష్ కుమార్ స్పష్టం చేశారు. ముఖ్యంగా ఆప్షన్ – 3 క్రింద లబ్దిదారులకు జె.ఎన్.ఆర్. నిర్మాణ సంస్థ ద్వారా నిర్మించి ఇస్తున్న ఇళ్లు త్వరగా పూర్తయ్యేలా చూడాలని ఆయన ఆదేశించారు. ఆప్షన్-3 ఇళ్ల నిర్మాణ పురోగతిపై బుధవారం హౌసింగ్ అధికారులతో తన క్యాంపు కార్యాలయంలో సమీక్షించారు. మార్కాపురం, పొదిలిలో ఆప్షన్-3 క్రింద జె.ఎన్.ఆర్. సంస్థ నిర్మిస్తున్న 3465 ఇళ్ల నిర్మాణ పురోగతిని హౌసింగ్ పి.డి. పేరయ్య ఈ సందర్భంగా కలెక్టర్ కు వివరించారు. జగనన్న కాలనీలలో ఇళ్ల నిర్మాణాలన్నీ డిసెంబర్ నాటికి పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యం నిర్దేశించినందున ఈ దిశగా దృష్టి సారించాలని కలెక్టర్ చెప్పారు. జె.ఎన్.ఆర్. సంస్థ కూడా అవసరమైన సంఖ్యలో కార్మికులను, నిర్మాణ సామగ్రిని పూర్తి స్థాయిలో సమకూర్చుకోవాలని ఆయన ఆదేశించారు. రెండు వారాలకు ఒకసారి తాను సమీక్షిస్తానని, ఈ నిర్మాణాలలో గణనీయమైన పురోగతి ఉండాలని కలెక్టర్ స్పష్టం చేశారు.
ఈ సమావేశంలో హౌసింగ్ డి.ఈ.ఈ.లు పవన్, చెన్నారాయుడు, జె.ఎన్.ఆర్. మేనేజింగ్ పార్ట్నర్ భాస్కర్ రెడ్డి పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *