తాళ్లూరు మండలంలో గురువారం వినాయక ఉత్సవాలు సందడిగా నిర్వహించారు. కొత్తపాలెం, తాళ్లూరులలో వినాయక మండపాలు వద్ద పెద్ద ఎత్తున పూజలు నిర్వహించి మేళ తాళాలతో గురువారం నిమర్జనానికి తరలించారు. కొత్తపాలెంలో జెడ్పీటీసీ మారం వెంకట రెడ్డి యూత్ ఆహ్వానం మేరకు వైఎస్సార్సీపీ తాళ్లూరు మండల ఇన్చార్జి మద్దిశెట్టి రవీంద్ర ప్రత్యేక పూజలు నిర్వహించారు. అభిమానులు కోరిక మేరకు ట్రాక్టర్ ను నడిపి ఉత్సాహ పరచారు. ఎంపీపీ తాటికొండ శ్రీనివాసరావు, జెడ్పీటీసీ మారం వెంకటరెడ్డి, పార్టీ అధ్యక్షుడు టివీ సుబ్బా రెడ్డి, సర్పంచిలు మేకల చార్లెస్ సర్జన్, వలి, పీఎస్ శ్రీకాంత్ రెడ్డి, హౌసింగ్ వేర్ రాష్ట్ర డైరెక్టర్ అంజలి ప్రసాద్ రెడ్డి, కోఆప్టస్ మెంబర్ కరిముల్లా, సొసైటీ అధ్యక్షుడు యాడిక యలమందా రెడ్డి, ఎస్సీ సెల్ మాజీ అధ్యక్షుడు పూనూరి దేవదానం తదితరులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.



