విఘ్నేశ్వరుని ఆశీస్సులు ప్రజలకు ఎల్లవేళలా మెండుగా ఉండి సుభిక్షంగా కాపాడాలని మాజీ సర్పంచ్ చింతా శ్రీనివాసరెడ్డి, ఉప సర్పంచ్ బిజ్జం జ్యోతి కృష్ణారెడ్డి అన్నారు. మండలంలోని పసుపు గల్లు గ్రామంలో వినాయక చవితి సందర్భంగా ఏర్పాటుచేసిన గణనాథుడికి 11 రోజులు పాటు భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో పూజలు చేశారు. గురువారం వినాయక విగ్రహం ఊరేగింపు కార్యక్రమం వైభవంగా సాగింది. జై గణేష ..జై జై గణేష నినాదాలతో …యువతీ యువకులు ఉత్సాహంగా ఉల్లాసంగా రంగురంగుల గులాములు చల్లుకుంటూ బాణాసంచా కాలుస్తూ డప్పు మేళ తాళాల వాయిద్యాల మధ్య డీజే మైకు సౌండ్ సిస్టం స్పీకర్లతో డాన్సులు వేస్తూ…. సందడి చేశారు. అనంతరం అద్దంకి సమీపంలోని గుండ్లకమ్మ నదిలో నిమజ్జనం చేశారు. నిమజ్జనం సందర్భంగా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పోలీసులు అప్రమత్తం గా వుండి బందోబస్తు నిర్వహించారు.

