ముండ్లమూరు మండలంలోని పసుపు గల్లు గ్రామంలో వైయస్సార్ సిపి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన వినాయక విగ్రహం వద్ద 15 కేజీల లడ్డుకు వేలం నిర్వహించగా ఒక లక్ష యాభై వేల రూపాయలకు అదే గ్రామానికి చెందిన పిక్కిలి ఆదిలక్ష్మి వేలం పాట పాడి పాట దక్కించుకున్నారు. వినాయక విగ్రహం వద్ద 20 రూపాయల నోట్ల దండ కు వేలంపాట నిర్వహించగా అదే గ్రామానికి చెందిన పాలం.బాలకృష్ణారెడ్డి 17వేల రూపాయలకు పాట దక్కించుకున్నాడు. వినాయకుని వద్ద ఉన్న పది రూపాయల నోట్ల దండకు వేలంపాట నిర్వహించగా ఇ డమకంటి శ్రీనివాసరెడ్డి రూ.12,000 రూపాయలు కు పాట పాడి పాట దక్కించుకున్నాడు. విగ్రహ కమిటీ సభ్యులైన మాజీ సర్పంచ్ చింతా శ్రీనివాస్ రెడ్డి, ఉప సర్పంచ్ బిజ్జం జ్యోతి కృష్ణారెడ్డి, కైపు వెంకటేశ్వర రెడ్డి, కోట బ్రహ్మారెడ్డి, ఏరువ నాగిరెడ్డి, చేతుల మీదుగా లడ్డు, నోట్ల దండ కట్టలను పాట పాడిన హక్కు దారులకు అందజేశారు.



