దేశ భక్తి చాటిన మహానీయుడు గుర్రం జాషువా అని ఎస్సై రామకృష్ణ అన్నారు. దర్శిరెవెన్యూ కార్యాలయం ప్రాంగణంలో జాషువా 128వ జయంతి వేడుకలు అన్నవరపు వెంకటేశ్వర్లు అధ్యక్షతన గురువారం ఘనంగా నిర్వహించారు. జాషువా చిత్ర పటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. జాషువా పద్యాలు ఆలపించిన కళాకా రులందరికీ పౌరసన్మానం చేశారు. ఎస్సై రామకృష్ణ మాట్లాడుతూ… సమ సమాజానికి కుల వివక్ష అం టరాని తనం రూపు మాపేందుకు అనేక అనేక పోరాటాలు చేసిన మహానీయుడని కొనియాడారు. సంఘ సేవకులు జీవీ రత్నం, దళిత ప్రజాసంఘాల నాయకులు ప్రేమ్ కుమార్, కండ్లకుంట మార్కు, , మోషే, ప్రసాద్, యర్రయ్య, డగ్లస్, కొండయ్య, ప్రసాద్ పాల్గొన్నారు.

