దర్శి నియోజకవర్గంలోని పలు దేవాలయాలకు మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ నాయకుడు శిద్దా రాఘవరావు గురువారం విరాళాలు అందజేశారు. దర్శి నియోజకవర్గంలోని యర్రోబనపల్లి ఆంజనేయస్వామి దేవస్థానానికి రూ.2లక్షలు, నాయుడుపాలెం పోలేరమ్మ దేవా లయానికి రూ.లక్ష రూపాయలు, శామంతపూడి శివాలయానికి లక్ష రూపాయలు, కట్టశింగన్నపాలెం పోలేరమ్మ గుడికి రూ.50 వేలు, అబ్బాయిపాలెం రాములవారి గుడికి రూ.50 వేల రూపాయలు, చందలూరు శివాలయం గుడికి రూ.25 వేల రూపాయలు విరాళంగా అందజేశారు. శిద్దారాఘవరావు ప్రతినిధి మండాది సుబ్బారావు ద్వారా దర్శిలో ఈనగదు ఆయా దేవాలయాల నిర్వాహకులకు అందజేశారు. బొగ్గవరపు సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.
