ప్రజా సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారిస్తు న్నట్లు ఎమ్మెల్యే డాక్టర్ మద్దిశెట్టి వేణుగోపాల్ పేర్కొ న్నారు. దర్శి ఎమ్మెల్యే కార్యాలయంలో గురు వారం ప్రజలు నాయకులు ఆయన దృష్టికి తీసుకువచ్చిన పలు ప్రజా సమస్యలు పరిష్కారం చేశారు. మండలాల వారీగా నాయకులు, కార్యకర్తలతో సమస్యల గురించి చర్చించారు. ఆయన మాట్లాడుతూ ప్రజా సమ స్యలు పరిష్కారం చేసినప్పుడే ప్రజా ప్రతినిధులకు గుర్తింపు వస్తుందని, మండలాల్లో ప్రజాప్రతినిధులు ఆయా సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు. ప్రజల సమస్యలుపై ప్రత్యేక దృష్టి పెట్టి వారిని ఆర్థికంగా ఆదుకోవడం లో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి దేశంలోనే మం చి సీఎంగా పేరు ప్రఖ్యాతులు, గుర్తింపు పొందారన్నారు. వైఎస్ఆర్సిపి నాయకులు మద్దిశెట్టి శ్రీధర్, మండల కన్వీనర్ వెన్నపూస వెంకటరెడ్డి ( మహేష్), రాష్ట్ర గ్రీనరీ అండ్ బ్యూటిఫికేషన్ డైరెక్టర్ కుమ్మిత అంజిరెడ్డి, మార్కెట్ యార్డ్ చైర్మన్ షకీలా అమీన్ బాషా, సొసైటీ అధ్యక్షుడు వేమిరెడ్డి చెన్నారెడ్డి, నాయకులు సాంస్కృతిక విభాగం అధ్య క్షుడు షేక్ సైదా, నాయకులు హరీష్ తదితరులు పాల్గొన్నారు.

