రాష్ట్రస్థాయి జూనియర్ రగ్బీ జట్టుకు మండలంలోని బొద్ధి కూరపాడు గ్రామానికి చెందిన జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు ఎంపికయ్యారు. కొనకనమిట్ల మండలం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాల ఆవరణలో ఎంపిక పోటీలు నిర్వహించగా జూనియర్ బాలుర విభాగంలో జి కుమార్, శివరామకృష్ణ, డి బ్రహ్మ తేజ, షేక్ హుస్సేన్ బాషా, కే నందకిషోర్, స్టాండ్ బై గా పి హేమంత్ రాష్ట్రస్థాయి జట్టుకు ఎంపికయ్యారు. అదేవిధంగా బాలికల జూనియర్ విభాగంలో ఏ కీర్తన, ఎం నాగమణి ,పి కోమలి రాష్ట్రస్థాయి రబ్బీ జుట్టుకు ఎంపికయ్యారు. మొదటిసారిగా రాష్ట్రస్థాయి జట్టుకు ఎంపికైన బాల, బాలికలను ,దీనికి కృషిచేసిన ఎఫ్ఎసి ప్రధానోపాధ్యాయులు సిహెచ్ సురేష్, పిడి రవి ప్రసాద్ రెడ్డి లను , పీసీ చైర్మన్ వై కృష్ణారెడ్డి, గ్రామ సర్పంచ్ మందా శ్యామ్సన్, ఉప సర్పంచ్ పులి ప్రసాద్ రెడ్డి, ఎంపీటీసీ బాలకోటయ్య, గ్రామానికి చెందిన విశ్రాంత ఉపాధ్యాయులు రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత ఎస్ .అంజిరెడ్డి, ఉపాధ్యాయులు, గ్రామస్తులు, అభినందనలు తెలిపారు. రాష్ట్రస్థాయి జట్టులో మంచి ప్రతిభ కనబరిచి జాతీయస్థాయి జట్టులోకి అడుగు పెట్టాలని విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు.

