ఒంగోలు మామిడిపాలెంలోని ఈ.వి.ఎం. గోదాములను జిల్లా కలెక్టర్ ఏ.ఎస్. దినేష్ కుమార్ శనివారం తనిఖీ చేశారు. వచ్చే సాధారణ ఎన్నికల్లో వినియోగించడానికి ఇప్పటికే జిల్లాకు చేరిన బ్యాలెట్ యూనిట్లు, కంట్రోల్ యూనిట్లు, వీ.వీ. ప్యాట్ల తొలి దశ పరిశీలన (ఎఫ్.ఎల్.సీ) ప్రక్రియ అక్టోబర్ 16వ తేదీ నుంచి 23 రోజుల పాటు జరుగనున్నది. దీనికోసం బెంగళూరు బెల్ కంపెనీ నుంచి 15 మంది నిపుణులు రానున్నారు. ఈ దృష్ట్యా చేపట్టాల్సిన ఏర్పాట్లపై అధికారులతో ఈ సందర్భంగా కలెక్టర్ చర్చించారు. ఎలాంటి లోపాలు లేకుండా చర్యలు తీసుకోవాలని, బ్యారికేడ్ల నిర్మాణం ఇతర అవసరమైన భద్రత ఏర్పాట్లు చేపట్టాలని ఆదేశించారు. ఈ సందర్భంగా కలెక్టర్ వెంట డిఆర్డీఓ ఆర్. శ్రీలత, కలెక్టరేట్లోని ఎన్నికల విభాగ అధికారులు, తదితరులు ఉన్నారు.


