నిర్ధేశిత సమయం ప్రకారం మూడవ దశ రీ సర్వే పూర్తి చెయ్యాలని జిల్లా జాయింట్ కలెక్టర్ కె. శ్రీనివాసులు అన్నారు. ఒంగోలులో కలెక్టర్ కార్యాలయంలో జాయింట్ కలెక్టర్ ఛాంబర్లో శనివారం జిల్లా సర్వే. అధికారులకు రెవిన్యూ అధికారులకు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ డాక్టర్ కె. శ్రీనివాసులు మాట్లాడుతూ…. జిల్లాలో రీ సర్వే రెండు దశలలో సకాలంలో పూర్తి చేసిన సిబ్బందికి అభినందనలు తెలిపారు. మూడవ దశ గ్రామాలకు సంబంధించి మ్యుటేషన్ లు, క్షేత్ర స్థాయిలో ట్రూ థింగ్ దశలోనే గుర్తించి అక్టోబర్ 15 నాటికి ఆదేశించాలని ఆదేశించారు. గ్రౌండ్ ట్రూ థింగ్ సమయంలో అనుభవ వివరాల డేటా సేకరణ, వెక్టరైజేషన్ మరియు ప్రిలిమినరీ కో రిటేషన్ స్టేట్ మెంట్ లో డేటా ఎంట్రీ ప్రతి రోజు చెయ్యాలి అని ఆదేశించారు. మండల సర్వేయర్లు, డిప్యూటి ఇన్స్ఫెక్టర్లు ప్రతి రోజు రీ సర్వే ప్రగతిని గ్రామ సర్వేయర్లతో సమీక్షించి సమస్యలను పరిష్కరించాలని హితవు చెప్పారు. మండల అధికారులు రీ సర్వేలో లాగిన్లో డేటా ఎంట్రిని 70శాతం అక్టోబర్ 30 నాటికి పూర్తి చెయ్యాలని, మిగిలిన 30శాతం నవంబర్ 8 నాటికి పూర్తి చెయ్యాలని ఆదేశించారు. టైమ్ లైన్ ఖచ్చితంగా పాటించాలని, నిర్దేశిత సమయంలో పూర్తి చేయని వారు త్వరగా పూర్తి చెయ్యాలని హెచ్చరించారు.

