ప్రజల ఆరోగ్యం పట్ల ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారని ఎమ్మెల్యే డాక్టర్ మద్దిశెట్టి వేణుగోపాల్ అన్నారు. బొట్లపాలెంలో శనివారం జగనన్న ఆరోగ్య సురక్ష కార్య క్రమంలో ఎమ్మెల్యే డాక్టర్ మద్దిశెట్టి వేణుగోపాల్ ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. వైద్య పరీక్షలు, ల్యాబ్ టెస్ట్లు, మందులు తదితర విభాగాలు పరి శీలించారు. ఎమ్మెల్యే డాక్టర్ మద్దిశెట్టి వేణుగోపాల్ మాట్లాడుతూ …45 రోజుల పాటు ఈ సేవలు అందించడం జరుగుతుందని చెప్పారు. డీడీఓ కిరణ్మయి, వైద్యులు సక్రూనా యక్, సుమన్, ప్రవీణ్ కుమార్, నియోజకవర్గ రిట ర్నింగ్ అధికారి ఎంవీఎస్ లోకేశ్వరరావు, డీటీ రవిశంకర్, ఈఓఆర్డీ శోభన్ బాబు, ఎంపీపీ సుధా అచ్చయ్య, మండల పార్టీ అధ్యక్షుడు వెన్నపూస వెంకటరెడ్డి, రాష్ట్ర గ్రేడింగ్ అండ్ బ్యూటిఫికేషన్ డైరెక్టర్ కుమ్మిత అంజిరెడ్డి, ఏఎంసీ చైర్మన్ షకీలా అమీన్ బాషా, జేఏసీ కన్వీనర్ బత్తినేని వెంకటే శ్వర్లు, పట్టణ పార్టీ అధ్యక్షుడు కట్టెకోట హరీష్, భోగిరెడ్డి సుబ్బారెడ్డి, పాపి రెడ్డి, అంజిరెడ్డి, గంగిరెడ్డిపాలెం యలమందారెడ్డి, శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు.










