మౌలిక వసతుల కల్పనే లక్ష్యం జిల్లా పరిషత్ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ

జిల్లాలోని ప్రభుత్వ పాఠశా లల్లో మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నట్లు జిల్లా పరిషత్ చైర్పర్సన్ వెంకాయమ్మ పేర్కొన్నారు. దర్శి లోని మోడల్ పాఠశాల ను శనివారం ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. మోడల్ పాఠశాలలోని గ్రౌం డ్ లెవల్ చేసేందుకు రూ.5 లక్షలు మంజూరు చేసి పని పూర్తి చేయించి నందుకు ఆమెకు సన్మానం చేశారు. జిల్లా పరిషత్ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ మాట్లాడుతూ… ముఖ్య మంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విద్యలో విప్లవాత్మక మార్పులు తెచ్చారన్నారు. నాడు-నేడు, అమ్మఒడి, విద్యాదీవెన, వసతి దీవెన, విదేశీ విద్య వంటి పథకాలు పెట్టి అం దరికీ విద్య అందుబాటులోకి తెచ్చార న్నారు. తాను బాధ్యతలు తీసుకున్న తరువాత జిల్లా పరిషత్ ఉన్నత పాఠ శాలలు, మోడల్ పాఠశాలలు, కస్తూర్బా గాంధీ బాలికల విద్యాల యాల్లో మౌలిక వసతుల కల్పనకు ని ధులు మంజూరు చేస్తున్నట్లు తెలి పారు. మోడల్ పాఠశాలకు ఆడిటో రియం కావాలని విద్యార్థులు కోరగా మంజూరు చేస్తామన్నారు. ఎంఈ ఓలు రఘురామయ్య, రమాదేవి, ప్రిన్సిపాల్ హసీన తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *