కార్యకర్తల పనితీరుకు పట్టం -పలువురు భాజపా కార్యకర్తలకు మండల కమిటీలలో స్థానం -తీగల సత్యవతి.

భాజపా మండల ప్రవాస్ యోజన కార్యక్రమాల్లో భాగంగా మండలాల పరిధిలో పర్యటిస్తున్న మండల ఇంఛార్జ్ మరియు జిల్లా బిజేపి కార్యదర్శి తీగల సత్యవతి మాట్లాడుతూ …రాబోవు సార్వత్రిక ఎన్నికలకు పార్టి కార్యకర్తలను సమాయత్తం చేయుటకు, శక్తి కేంద్రాలను బలోపేతం చేయడానికి మరియు స్థానికంగా ఉన్న సమస్యలను గుర్తించి వాని పరిష్కారానికి కృషిచేయుటకు ఉద్దేశించినదని తెలిపారు.
ఒంగోలు నగరంలోని స్థానిక సుందయ్య భవన్  రోడ్డు నందలి శనివారం ప్రముఖ చిన్నపిల్లల హాస్పటల్ శాంతి నర్సింగ్ హోమ్ లో భారతీయ జనతా పార్టీ జిల్లా డాక్టర్స్ సెల్ కన్వీనర్ డాక్టర్ కొమ్మి నరసింగరావు ఆధ్వర్యంలో, మండల అధ్యక్షులు డబ్బుకొట్టు మనోజ్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన మండల ప్రవాస్ యోజన కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సందర్భముగా పలువురు కార్యకర్తలకు మండల కమిటీలలో వివిధ హోదాలలో స్థానం కల్పించారు. డి లక్ష్మీనారాయణ ను మండల ప్రధాన కార్యదర్శిగా, ఎం సుజాత కు మండల మహిళా నాయకురాలిగా బాధ్యతలలో నియమించారు.
కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు రావులపల్లి నాగేంద్ర యాదవ్, యువమోర్చా నాయకులు రాజేష్ వర్మ,జిల్లా నాయకులు కేశిన రమేష్ తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *