సంపూర్ణ ఆరోగ్యానికి చిరు ధాన్యాల వంటకాలు దోహదపడతాయని దర్శి ఎమ్మెల్యే డాక్టర్ మద్దిశెట్టి వేణుగోపాల్ అన్నారు. తాళ్లూరు మండలం లోని మాధవరం గ్రామంలో శనివారం ఐసిడిఎస్ ఆధ్వర్యంలో చిరుధాన్యాలతో తయారు చేసిన పౌష్టిక ఆహారాన్ని ప్రదర్శించారు. ఈ ప్రదర్శనను ఎమ్మెల్యే డాక్టర్ మద్దిశెట్టి వేణుగోపాల్ ప్రారంభించి చిరుధాన్యాలతో తయారైన వంటకాలను రుచి చూసి అంగన్వాడీ , వ్యవసాయ శాఖ సిబ్బందిని అభినందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ మద్దిశెట్టి వేణుగోపాల్ మాట్లాడుతూ …చిరుధాన్యాలలో అన్ని రకాల పోషక విలువలు లభిస్తాయని వాటిని ఆహారంగా కలిగి ఉన్నట్లయితే ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని ఆయన తెలిపారు. మారుతున్న సమాజంలో మనం తీసుకునే ప్రతి ఆహారంలో అన్ని రకాల పోషక విలువలు ఉన్నట్లయితే శరీరం ఆరోగ్యంగా ఉంటుందని దీనిని గుర్తించి ప్రజలు చిరుధాన్యాలను ఉపయోగించి ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవాలని కోరారు. స్టాల్స్ నందు జొన్న రొట్టె, సజ్జ బూరెలు, రాగి లడ్డు, కొర్ర హల్వా తదితర వంటకాలను క్షుణ్ణంగా పరిశీలించారు. కార్యక్రమంలో ఎంపీపీ తాటికొండ శ్రీని వాస రావు, జడ్పిటిసి మారం వెంకటరెడ్డి, మండల ఉపాధ్యక్షులు ఎడమ కంటి వెంకటేశ్వర రెడ్డి, మంచాల ప్రియాంక నాగార్జున రెడ్డి , కో ఆప్షన్ నెంబర్ కరిముల్లా, వ్యవసాయ అధికారి బి ప్రసాద్ రావు, ఐసిడిఎస్ సూపర్వైజర్ జి జ్యోతి, పలు గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, వైసిపి నాయకులు, అంగన్వాడీలు పాల్గొన్నారు.

